ఓ క్యాబ్ డ్రైవర్ తన తల్లికి కరోనా లక్షణాలున్నాయని పరీక్షలు చేయించాడు. కొవిడ్ నెగిటివ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెను హైదారాబాద్ కుషాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని మొదట్లో చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం నాలుగు రోజులకి రూ.3 లక్షల 70 వేలు బిల్ వేసింది. ఇంతలోనే ఆ తల్లి మరణించింది. అయినా కనికరం లేని ఆస్పత్రి యాజమాన్యం బిల్ కట్టి మృతదేహం తీసుకెళ్లాలని చెప్పింది.
4 రోజులకు 3 లక్షల 70 వేల రూపాయల బిల్లు
కరోనా కంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలకు వేసే బిల్ చూస్తే వణికిపోతున్నారు జనాలు. లక్షల్లో బిల్లు చూసి అవాక్కవుతున్నారు. తాజాగా హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఓ కరోనా రోగికి నాలుగు రోజులకు 3 లక్షల 70 వేల బిల్ వేశారు.
4 రోజులకు 3 లక్షల 70 వేల రూపాయల బిల్