బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండె మరో వ్యక్తికి ప్రాణం పోసింది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో 41 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కావటంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. జీవన్‌దాన్ ద్వారా ఇంకొకరికి ప్రాణం పోయవచ్చని వైద్యులు చెప్పటంతో మృతుని కుటుంబసభ్యులు అంగీకరించారు.
సికింద్రాబాద్‌లో 12 నిమిషాల్లోనే గుండె మార్పిడి...
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తం గుండె కేర్ ఆస్పత్రిలో మరో వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో జరిగిన ఈ గుండె మార్పిడి వేగంగా స్పందించే గుణం, దాతృత్వం విలువను చాటి చెప్పింది.
సికింద్రాబాద్‌లో 12 నిమిషాల్లో గుండె మార్పిడి పూర్తి
కేర్ ఆసుపత్రిలో 48 ఏళ్ల మరో వ్యక్తికి గుండె అవసరముందని తెలిసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది... ట్రాఫిక్ పోలీసులు, హాస్పిటల్‌కు సమాచారం అందించి... గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గుండెను తీసిన 12 నిమిషాల్లోనే కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో వ్యక్తికి అమర్చటంతో ఒక నిండు ప్రాణం నిలిచింది. ఈ ఘటన వేగంగా స్పందించే గుణం, దాతృత్వం విలువను చాటి చెప్పింది.
ఇవీ చూడండి: ప్లాస్టిక్ నుంచి పేపర్ సంచికి మారుదాం...