తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణపై జనవరి 11న నిర్ణయం - జగన్ అక్రమాస్తుల కేసు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసుల కన్నా ముందు ఈడీ కేసుల విచారణ జరపాలన్న అంశంపై వాదనలు పూర్తయ్యాయి. ఈ అంశంపై జనవరి 11న కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది.

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ అంశంపై జనవరి 11న నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ అంశంపై జనవరి 11న నిర్ణయం

By

Published : Dec 15, 2020, 10:39 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట ఈడీ కేసులు విచారణ జరపాలా లేక సీబీఐ కేసులా అనే అంశంపై న్యాయస్థానం జనవరి 11న నిర్ణయం వెల్లడించనుంది. జగన్ అక్రమాస్తులపై సీబీఐ 11, ఈడీ 6 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. అయితే సీబీఐ ఛార్జ్ షీట్లతో సంబంధం లేకుండా తమ అభియోగ పత్రాలపై విచారణ ప్రారంభించాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కోరింది.

సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసినందున.. ముందుగా సీబీఐ కేసులపై విచారణ జరపాలని.. లేదా రెండూ సమాంతరంగా జరపాలని జగన్, విజయ్ సాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు వాదించారు. అందరి వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు తీర్పును.. జనవరి 11కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:వచ్చే ఏడాది నలుగురు ఐపీఎస్​లు పదవీ విరమణ

ABOUT THE AUTHOR

...view details