తెలంగాణ

telangana

ETV Bharat / state

bandaru dattatreya: 'దీపావళి కాంతుల్లో కొవిడ్​ మహమ్మారి అంతమవ్వాలి' - హైదరాబాద్​ వార్తలు

హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ (Haryana state governor bandaru dattatreya) చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కొవిడ్​ మహమ్మారి అంతమవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

bandaru dattatreya
bandaru dattatreya

By

Published : Nov 1, 2021, 12:42 PM IST

దీపావళి వెలుగులతో కరోనా మహమ్మారి అంతమవ్వాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించానని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు (Haryana state governor bandaru dattatreya). చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న దత్తాత్రేయ.. ప్రత్యేకంగా పూజలు చేశారు.

యునిసెఫ్, యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్​ఎంసీ కార్మికులకు హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యంగిస్తాన్ సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను దత్తాత్రేయ అభినందించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ

కొవిడ్​ మహమ్మారిపై సుమారు 80శాతానికి పైగా విజయాన్ని సాధించాము. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ.. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఉండాలి. దేశంలో వందకోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్​ పూర్తయింది. చిన్నపిల్లలకు కూడా త్వరలోనే వ్యాక్సిన్​ వస్తుంది. ఈ దీపావళి పండుగ ప్రజలందరికీ సుఖ, శాంతులు కలిగించాలి, దీపావళి కాంతులు కొవిడ్​ మహమ్మారిపై విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థించాను. బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్‌.

ఇదీ చూడండి:SEED CRACKERS: మార్కెట్లోకి కొత్త సరుకు... పర్యావరణహిత బాణసంచా

ABOUT THE AUTHOR

...view details