బస్తీ దవాఖానాల పని తీరుపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 259 బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. అవి అత్యంత ప్రజాదరణ పొందాయని అన్నారు.
త్వరలో బస్తీ దవాఖానాల్లో ఆన్‌లైన్ సేవలు: మంత్రి హరీశ్ - telangana health
బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల పని తీరుపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్తీ దవాఖానల్లో అందిస్తున్న సేవలు ఆన్‌లైన్ కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు
ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ సహా ఇతర ప్రాంతాల్లో మిగతా 131 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 15 నాటికి మరికొన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఈ సేవలు ఆన్‌లైన్ కావాలన్న మంత్రి... టీ డయాగ్నొస్టిక్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బస్తీ దవాఖానల్లో టెలి కన్సల్టేషన్ సేవలు పెంచాలని కోరారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, మరుసటి రోజు వైద్యుడికి రిపోర్టు చూపించి వైద్యం పొందేలా ఉండాలన్నారు.
ఇవీ చదవండి: