తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao on Telangana Development : 'హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగాయి' - Minister Harish Rao latest comments

Little Stars and She Hospital Inauguration in Hyderabad : హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగాయని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం వైద్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Harish Rao
Harish Rao

By

Published : Jun 11, 2023, 5:31 PM IST

Harishrao Participated in Little Stars Hospital Inauguration : హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యపడిందని వివరించారు.

Director Rajamouli Participated in Little Stars Hospital Inauguration : అంతేగాక.. ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయ పురోగతి సాధిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ, నిమ్స్‌లో ఎంసీహెచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో గాంధీ ఆసుపత్రిలో సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. అవయవాల మార్పిడీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. త్వరలోనే 10 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Minister Harish Rao latest news : 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే.. ఇప్పుడు అది 70 శాతానికి పెరిగినట్లు మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, గర్భిణీలలో ఎనీమియా వ్యాధి తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తామని వెల్లడించారు. మాతా-శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. అనవసర సి-సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేటు ఆసుపత్రులు సహకారం అందించాలని కోరారు. అనవసర సి-సెక్షన్ల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

"ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. తెలంగాణ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందింది. గాంధీ, నిమ్స్‌లలో ఎంసీహెచ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు గత నెల 70 శాతానికి చేరాయి. అవయవాల మార్పిడీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తాం".- హరీశ్​ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

'హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగాయి'

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు..: ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిని హరీశ్​రావు అభినందించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని కొనియాడారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ, ఇతర సేవలకు సంబంధించిన వ్యయాలను భరించేందుకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆస్కార్​ సాంధించిన రాజమౌళిని ఈ సందర్భంగా అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details