ఐజీఎస్టీ సమస్యల పరిష్కార కమిటీలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు - igst latest news
18:38 July 22
ఐజీఎస్టీ సమస్యల పరిష్కార కమిటీలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
ఐజీఎస్టీ(ఇంటిగ్రెటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) సమస్యల పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో మార్పులు చేసింది జీఎస్టీ మండలి. ఏడుగురితో కొత్త కమిటీ ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలి.. నూతన కమిటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది.
కమిటీకి కన్వీనర్‌గా బిహార్ ఆర్థికశాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీని నియమించింది. ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీలో మార్పులు చేస్తూ మెమోరాండం విడుదల చేసింది.
ఇదీ చూడండి :ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్ రావు