తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Counter on Amit Shah Comments : 'కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ' - telangana political news

Harish Rao Counter on Amit Shah Comments : కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్​రావు దీటుగా స్పందించారు. కేంద్రం చేస్తున్నవన్నీ అవాస్తవమైన ఆరోపణలని పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదనడం పచ్చి అబద్ధమని తెలిపారు. కృష్టా జలాల కోసం తమ ప్రభుత్వం కృషి చేయడం లేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ అని మంత్రి విమర్శించారు.

minister Harish rao comments on BJP
Minister Harish Rao comments on Union Minister Amit Shah

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 12:03 PM IST

Harish Rao Counter on Amit Shah Comments: ఇటీవల ఆదిలాబాద్ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత అమిత్​షా పలు విమర్శలు చేసిన నేపథ్యంలో వాటిపై మంత్రి హరీశ్​రావు స్పందించారు. ములుగులోగిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదనడం పచ్చి అబద్ధమని మంత్రి హరీశ్​రావు అన్నారు. రాష్ట్రప్రభుత్వం 2016 సెప్టెంబర్​లోనే ములుగు మండలంలో రెండు ప్రాంతాల్లో భూములను గుర్తించి కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ బృందం 2017 ఫిబ్రవరి 13న రాష్ట్రానికి వచ్చి భూములను పరిశీలించిందని వివరించారు. అనంతరం గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలపకుండా పెండింగ్​లో పెట్టిందని మంత్రి ఆరోపించారు.

BRS Election Campaign Telangana 2023 : సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలతో.. ప్రచారంలో బీఆర్ఎస్ జోష్

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగులో 335.04 ఎకరాలను కేటాయించిందని మంత్రి తెలిపారు. తాత్కాలిక తరగతుల కోసం ములుగులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనాలను ఇస్తామని చెప్పిందన్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దాదాపు ఏడేళ్లుగా నాన్చుతూ వస్తున్న కేంద్రం.. ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా ప్రకటన చేసిందని విమర్శించారు.

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ అని మంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే 2014 జులై 14న కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అనేక సార్లు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. అప్పటి నుంచి పలుమార్లు ప్రధాన మంత్రికి, కేంద్రమంత్రులకు, కేఆర్​ఎంబీకి రాష్ట్రప్రభుత్వం లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వాటిని కేంద్రం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు.

Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్​లో కాషాయ జెండా ఎగురుతుంది

ఏళ్లు గడుస్తున్నా కేంద్రం వహిస్తున్న మౌనంపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి తెలిపారు. 2020 అక్టోబర్​లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 2021 జూన్​లో రాష్ట్ర ప్రభుత్వంసుప్రీంకోర్టులో వేసిన పిటిషన్​ను ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ఇంత చేసినా ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి అమిత్​ షా చెప్పడం సిగ్గుచేటని మంత్రి ఆక్షేపించారు.

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ చేపట్టాలని కేసీఆర్ కోరారని హరీశ్​రావు తెలిపారు. పిటిషన్ ఉపసంహరించుకొని మూడేళ్లు గడుస్తున్నా.. కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదన్నారు. తీరా ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికోసమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని కేంద్రంపై మంత్రి విమర్శలు గుప్పించారు.

Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details