ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని హైదరాబాద్లో తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రంగురంగుల విద్యుద్దీపాలతో, విభిన్న రకాల పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించారు. స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్లో నిలబడి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో సామూహిక తులసి అర్చనలు నిర్వహించారు.
ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు - హైదరాబాద్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని ఆలయాలకు భక్తులు బారులు తీరారు. చిక్కడపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిక్కడపల్లిలోని వేంకటేశ్వర ఆలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్వయంంభు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో రాత్రికి కీర్తనలు, 108 జంటలతో కలశపూజ నిర్వహించనున్నట్లు ఆలయ పూజరులు తెలిపారు. ఇందులో ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డి, తెలంగాణ మహిళా శిశుసంక్షేమ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, టీఎంసీ ఛైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, స్థానిక కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గోనున్నారు.
ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు..