తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు.. 21న 'పీస్​ ఫెస్ట్​-2019' - హరేకృష్ణ మూమెంట్

పాఠశాల విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పట్ల అవగాహన పెంపొందించేందుకు రోటరీ క్లబ్​, హరేకృష్ణ మూమెంట్​ సంయుక్తంగా ఈ నెల 21న పీస్​ ఫెస్ట్​-2019 పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్​ పోస్టర్​ను హరేకృష్ణ దేవాలయంలో విడుదల చేశారు.

hare Krishna-movement- conducting- peace fest-2019_in_gold temple

By

Published : Sep 11, 2019, 5:08 PM IST

ఈ నెల 21న 'పీస్​ ఫెస్ట్​-2019' పోటీలు

హరేకృష్ణ మూమెంట్ సంస్థ, రోటరీ క్లబ్, స్మార్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'పీస్ ఫెస్ట్ 2019'కు సంబంధించిన టీజర్ పోస్టర్​ను విడుదల చేశారు. బంజారాహిల్స్​లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు సత్య గౌరచంద్రదాస ప్రభూజీ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విద్య పట్ల అవగాహన పెంపొందించేందుకు రోటరీ క్లబ్​ సభ్యులు.... వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం వంచి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 21 న ఉదయం 8 నుంతి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. బంజారహిల్స్​ రోడ్​ నెం.12లోని హరేకృష్ణ గోల్డెడ్​ టెంపులో ఈ పోటీలు జరుపనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details