Governor and CM New Year Wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాదిలో అందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సాంఘిక రుగ్మతలపై పోరాటానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరం స్నేహపూర్వక, ఆరోగ్యకర సమాజం కోసం పాటుపడదామని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం - telangana news today
Governor and CM New Year Wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు అందరూ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
Governor
కొవిడ్‌ను భారత్ సమర్థంగా నియంత్రించిందని గవర్నర్ కొనియాడారు. భవిష్యత్‌లో మన దేశం ఇంకా చాలా విజయాలు సాధించాలని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇవీ చదవండి:
Last Updated : Jan 1, 2023, 7:51 AM IST