లాక్‌డౌన్ సమయంలో చేతి వృత్తులు, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. సీజనల్‌గా మాత్రమే పని ఉండే కులాల వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో నాదస్వరం పనిచేసుకుంటూ వేల సంఖ్యలో కుటుంబాలు జీవిస్తున్నాయి. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సమయంలో వారికి పని ఉండేది.. లాక్‌డౌన్‌తో ఆ కుటుంబాలకు పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి పరిస్థితిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
నాదస్వరం గొంతు నొక్కిన లాక్‌డౌన్
చేతి వృత్తులపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా వేసవి అంటే పెళ్లిళ్ల సీజన్... నిత్యం ఎక్కడో చోట మంగళవాద్యాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ జనారణ్యంలో కరోనా సంచారంతో వేడుకలన్నీ మూగబోయాయి. పనిలేక వాద్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
నాదస్వరం గొంతు నొక్కిన లాక్‌డౌన్