కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో పూర్ణసాయి అనే 13 నెలల బాలుడు వైద్యం వికటించి మరణించాడు. ఆడుకుంటూ వేడినీటిలో చేయి పెట్టడం వల్ల చేయి కాలిందని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఏకంగా బాబును చంపేశారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు చనిపోవడానికి బాధ్యులైన ఆ ప్రైవేటు ఆస్పత్రి యాజమానులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాలుడి బంధువులు దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ వైద్య అధికారులు ఆసుపత్రికి చేరుకుని విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
'బాబు చెయ్యి కాలిందని ఆస్పత్రి తీసుకెళ్తే చంపేశారు'
వైద్యం వికటించి 13 నెలల పసిగుడ్డు మృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యానికి పసి బాలుడు మరణించాడు.
చెయ్యి కాలింది... పసిగుడ్డు మరణించాడు