తెలంగాణలో పౌర సరఫరాల శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయవద్దని రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ పేర్కొన్నది. రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసరఫరాల శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేసి వందలాది మంది ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో హమాలీ కార్మికులు రిలే నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్ధతుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలరాజ్ పాల్గొన్నారు. సివిల్ సప్లై శాఖను పూర్తిగా రద్దు చేసి తమ జీవితాలకు ఉపాధి లేకుండా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
పౌర సరఫరాల శాఖను విలీనం చేయోద్దు - హమాలీ కార్మికులు
పౌర సరఫరాల శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయవద్దని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది.హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సివిల్ సప్లై హమాలీ కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
పౌర సరఫరాల శాఖను విలీనం చేయోద్దు