విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కేరళ వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు - తెలంగాణలో వర్ష సూచన
రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలలతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రత సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున ఉష్ణోగ్రత సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 18 శాతం పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకూ 109 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాయుడుపేట (భద్రాద్రి జిల్లా)లో 4, కొత్తమోల్గర (మహబూబ్‌నగర్)లో 3.4, వనపర్తిలో 2.3, ఎల్బీనగర్ (హైదరాబాద్)లో 1.3, ఆల్వాల్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. బయట ఆరబోసిన ధాన్యం తడిసిపోయాయి.
ఇదీ చూడండి:కరోనా రోగుల మోర్టాలిటీ ప్రిడిక్షన్ రూపొందించిన ట్రిపుల్ ఐటీ