రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. శాసనమండలి ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసిన నేపథ్యంలో గుత్తా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.
రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి గుత్తా రాజీనామా - రాజీనామా
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేయడం వల్ల రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి గుత్తా రాజీనామా