హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయంలో భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షుడు, గుజరాత్ మాజీ మంత్రి దిలీప్ సంఘానియా కుటుంబసమేతంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాల పరిశీలనకు వచ్చిన దిలీప్ మంత్రితో భేటీ అయ్యారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
'అన్ని రాష్ట్రాల సహకార సంఘాలను పరిశీలిస్తాం... ఇక్కడ పటిష్ఠం చేస్తాం' - మంత్రి నిరంజన్ రెడ్డి వార్తలు
తెలంగాణ ప్రభుత్వం.. దేశంలో వివిధ రాష్ట్రాల సహకార సంఘాలను పరిశీలించి తెలంగాణ సహకార వ్యవస్థను పటిష్ఠం చేస్తుందని... గుజరాత్ మాజీ మంత్రి దిలీప్ సంఘానియాకి.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని రైతు సహకార సంఘాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.
మహారాష్ట్రలో రైతు సహకార సంఘాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయని మంత్రి కొనియాడారు. అక్కడ 12 వేల నుంచి 25 వేల మంది రైతులు కలిసి చక్కెర కర్మాగారాలను లాభాల్లో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని మంత్రి తెలిపారు. తెలంగాణ రైతులను ఆ దిశగా నడిపించేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయం అనుబంధ రంగాలపై అవగాహన, మెలకువలు, రైతుల విజయగాథలు తెలుసుకునేందుకు 2,601 రైతు వేదికలు నిర్మించామని వెల్లడించారు.
ఇదీ చూడండి:దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో ఆసరా పింఛన్లు: ఎర్రబెల్లి