కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న కొవిడ్ రోగులకు ప్లాస్మా ప్రాణం పోస్తుంది. కొవిడ్ నుంచి కొలుకున్న వారిలో అర్హులైన వారి నుంచి సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స ఇచ్చి కాపాడతారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న రోగికి తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి ప్లాస్మా సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీనితో అపోలో ఆస్పత్రిలో కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధ పడుతున్న రోగికి గూడూరు ప్లాస్మా దానం చేశారు. గత కొన్ని రోజులుగా ప్లాస్మా దాతల కోసం కృషి చేస్తున్న గూడూరు నారాయణ రెడ్డినే స్వయంగా దానం చేశారు.
కరోనా రోగికి ప్లాస్మాదానం చేసిన గూడూరు నారాయణరెడ్డి - తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్
కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న కరోనా రోగికి గూడూరు నారాయణరెడ్డి ప్లాస్మా దానం చేశారు. గత కొన్ని రోజులుగా ప్లాస్మా దాతల కోసం కృషి చేస్తున్న ఆయన... తానే ప్లాస్మా దానం చేసి ప్రాణదాతగా నిలిచారు.
కరోనా రోగికి ప్లాస్మాదానం చేసిన గూడూరు నారాయణరెడ్డి
ఇప్పటివరకు వందకుపైగా ప్లాస్మా దాతలను తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ నేతలు ఒప్పించి దానం చేయించారు. కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధ పడుతున్న రోగులకు ప్లాస్మా దానం చేయిస్తూ తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ సభ్యులు ప్రాణదాతలుగా మారారు.
ఇవీ చూడండి: ప్లాస్మా దాతలతో కలిసి గవర్నర్ వేడుకలు