తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖండాంతరాలకు తెలంగాణ "పల్లీ".. యూరప్​తో ఒప్పందం - ground nut

తెలంగాణ నుంచి యూరప్‌కు వేరుశనగ ఎగుమతి చేయనున్నారు. ఈ మేరకు నెదర్లాండ్‌లో వేరుశనగ దిగుమతిదారుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు.

యూరప్​కు తెలంగాణ పల్లికాయ

By

Published : Nov 3, 2019, 8:27 PM IST

యూరప్​కు తెలంగాణ పల్లికాయ

నెదర్లాండ్‌లో వేరుశనగ దిగుమతిదారుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో నెదర్లాండ్స్ వేరుశనగ పరిశ్రమ దిగుమతిదారుల తరఫున నెక్స్‌ ప్యాక్, అమెరికాలో వేరుశనగపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు విలియం ఈపెరల్, చెరిల్ ఈ హ్యారిసన్ పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్న వేరుశనగను రైతులకు లాభం కలిగేలా దళారుల ద్వారా కాకుండా నేరుగా యూరప్‌కు ఎగుమతి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉత్పత్తి, ప్యాకింగ్, ఎగుమతుల్లో సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details