సికింద్రాబాద్ అడ్డగుట్టలో భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా పేద ప్రజలు చేయడానికి పనులు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారని సంస్థ ప్రతినిధి రమాజ్యోతి తెలిపారు. అటువంటి ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నగరంలోని మొత్తం 30 మురికి వాడల్లోని 6 వేల మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
'లాక్డౌన్ ఎత్తివేసినా పేదప్రజలకు ఇక్కట్లు తప్పట్లేవు' - corona effect
లాక్డౌన్ ఎత్తివేశాక కూడా పేద ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదని భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ప్రతినిధి రమాజ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'లాక్డౌన్ ఎత్తివేసినా పేదప్రజలకు ఇక్కట్లు తప్పట్లేవు'
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించట్లేదని రమాజ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఇంకా అవగాగన పెరగేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.