లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తోంది. హైదరాబాద్ గోషామహల్ డివిజన్లోని మోచి బస్తీలో కులవృతిపై ఆధారపడి జీవిస్తున్న 500వందల కుటుంబాలకు వారానికి సరిపడే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ తమ చేతుల మీదుగా అందజేశారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం - lockdown in telangana
లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూతను అందిస్తోంది. హైదరాబాద్ గోషామహల్‌లోని మోచి బస్తీలో నివసిస్తున్న 500 నిరుపేద కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను ట్రస్ట్ ఛైర్మన్ అందజేశారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం
ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దనే సంకల్పంతో తమ ట్రస్ట్ విశేషంగా కృషిచేస్తుందని పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని వెల్లడించారు.
ఇవీ చూడండి: పౌరులంతా సైనికులే.. అందరికీ సెల్యూట్: మోదీ