తెరాస ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వీకరించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాయని, యాంకర్ మంగ్లీ పాల్గొని మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: డీసీపీ - green challenge accepted by cybarabad additional cp venkateswarlu
సైబరాబాద్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో గాయని, యాంకర్ మంగ్లీతో కలసి మొక్కలు నాటారు.
![ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: డీసీపీ green challenge accepted by cybarabad additional cp venkateswarlu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7657907-253-7657907-1592403382522.jpg)
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి: డీసీపీ వెంకటేశ్వర్లు
ప్రతి ఒకరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ శ్యాం ప్రసాద్, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐలు రవీందర్, శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొని మొక్కలు నాటారు.
ఇదీ చూడండి:కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు