గ్రేటర్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రధాన పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. 105 మంది పేర్లు ప్రకటించిన తెరాస.. రెండోజాబితాలో మిగిలిన అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దిగాలని నిర్ణయించింది. కాంగ్రెస్, భాజపాలు కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ 20వ తేదీతో పూర్తికానుండటం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి నెలకొంది.
- అభ్యర్థుల ఎంపికలో అధికార తెరాస అందరికంటే ముందుంది. మొత్తం 150 డివిజన్లకు గాను 105 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన జాబితా గురువారం వెలువరించే అవకాశం ఉంది. అదే రోజు నుంచి మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు, నేతలు ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది.
- కాంగ్రెస్ పార్టీ 45 మంది పేర్లు ప్రకటించింది. శుక్రవారంలోగా మొత్తం అభ్యర్థులను ప్రకటించి ప్రచార బరిలో నిలవడానికి ప్రణాళిక రూపొందించింది.
- భాజపా.. 21 మందితో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. బలమైన కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించింది. వారిని పార్టీలోకి తీసుకొని కొన్ని డివిజన్లలో నిలపాలని నిర్ణయించింది. తెరాస టిక్కెట్లు దక్కని కొంతమంది అసంతృప్తులనూ చేర్చుకొని వారికి కొన్ని సీట్లు ఇవ్వాలని అగ్రనాయకులు భావిస్తున్నారు. పూర్తి జాబితాను శుక్రవారం నాటికి ప్రకటించనున్నారు.
- ఎంఐఎం 40 మందితో జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.
- జనసేన కూడా కనీసం 40 డివిజన్లలో అభ్యర్థులను నిలపాలనుకుంటోంది.
- సీపీఎం 5 స్థానాల్లో, సీపీఐ 6 స్థానాలకు ప్రకటించాయి. దాదాపు 50 డివిజన్లలో అభ్యర్థులను నిలపాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి.
- తెలుగుదేశం పార్టీ గురువారం ఉదయం అభ్యర్థులను ప్రకటించనుంది.
ఎంతమంది దాఖలు చేశారంటే..