Saddula Bathukamma: రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా బతుకమ్మ సంబురాలు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో బతుకమ్మ సంబురాలు (Bathukamma celebrations) కన్నుల పండువగా జరిగాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు.. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన పెద్ద బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఊయాలో అంటూ... ఆడపడుచులు కోలాటాలు, దాండియా నృత్యాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడి విశిష్టతను తెలుసుకున్నారు. సద్దుల బతుకమ్మ సంబురంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
'రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చినం. వచ్చినందుకు సద్దుల బతుకమ్మ చూసినం. చాలా మంచిగా అనిపించింది. - పర్యాటకులు
'మేమూ బతుకమ్మ పండుగ చేసుకుంటాం, కానీ ఇక్కడ చాలా బాగుంది.' - పర్యాటకులు
'రామోజీ ఫిల్మ్‌సిటీ చాలా బాగుంది. ఇక్కడ బతుకమ్మ వేడుకలు బాగా జరిగాయి. బాగా ఎంజాయ్ చేశాం. - పర్యాటకులు
' ఫిల్మ్‌సిటీ చాలా బాగుంది. బతుకమ్మ వేడుకల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాం. దాండియా ఆడాం.' - పర్యాటకులు
బతుకమ్మ సంబురాల కోసం ఫిల్మ్‌సిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ బృందంతో పండుగ విశిష్టత తెలిసేలా కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు రాలేకపోయామన్న పర్యాటకులు...ఈ సారి ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఏటా దసరా వేడుకలు ఇలానే నిర్వహించాలని కోరుకున్నారు.
ఇదీచూడండి:Saddula Bathukamma: అంబరాన్నంటిన సద్దుల సంబురాలు.. ఉయ్యాల పాటలతో మారుమోగిన ఊళ్లు