N.V.RAMANA AMERICA TOUR: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం న్యూయర్క్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్రా ఎల్ల, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, తానా ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు ఎన్.వి.రమణకు స్వాగతం పలికారు.
ఈ నెల 24న న్యూజెర్సీలో జరగనున్న తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా, 25న వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో జరగనున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొంటారు. సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో జులై 1న అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.