తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఘనంగా వైశాఖ శని పౌర్ణమి పూజలు' - CONTONMENT

వైశాఖ పౌర్ణమిని పురష్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఘనంగా యజ్ఞ, యాగాలు నిర్వహించారు. ఆయా ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం శనైశ్చరుడికి ప్రత్యేక  పూజలతో తైలాభిషేకాలు చేశారు.

వైశాఖ శని పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తుల ప్రత్యేక పూజలు

By

Published : May 18, 2019, 10:55 PM IST

వైశాఖ శని పౌర్ణమిని పురష్కరించుకుని కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని చారిత్రాత్మక గణపతి ఆలయంలో తెల్లవారుజాము నుంచి వేద మంత్రాలతో గణపతి హోమం, అభిషేకాలు, శనైశ్చరుడికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు ఘనంగా జరిపించారు.
భక్తుల సౌకర్యార్థం సూపరింటెండెంట్ బి.కె.రెడ్డి తగిన ఏర్పాట్లు చేయించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాడ్​బండ్​లోని వీరాంజనేయ స్వామి దేవాలయం, కార్ఖానాలోని ఆంజనేయ స్వామి , పాతబోయిన్​పల్లిలోని స్వయంభూ ప్రసన్న బాలాంజనేయ, కానాజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు బొల్లారం, లాల్ బజార్, తిరుమలగిరి, బోయిన్ పల్లి, పికెట్, మారెడ్​పల్లి తదితర ప్రాంతాల దేవాలయాల్లో విశిష్ట పూజలు నిర్వహించారు.

కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఘనంగా వైశాఖ శని పౌర్ణమి పూజలు

ABOUT THE AUTHOR

...view details