తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా ఓటరు నమోదు... 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు

మహబూబ్​నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్​ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి అక్టోబర్​ 31 వరకు 2,77,932 దరఖాస్తులు వచ్చినట్లు ఈఆర్​వో పంకజ తెలిపారు. ఈనెల​ 6 వరకు గడువు ఉన్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

graduate voter registration for mlc elections at mahaboobnagar and rangareddy and hyderabad
జోరుగా ఓటరు నమోదు... 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు

By

Published : Nov 1, 2020, 3:12 PM IST

మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకై అక్టోబర్​ 31 వరకు 2,77,932 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిణి పంకజ తెలిపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 84,695 దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 8,970 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. మహబూబ్​నగర్ జిల్లాలో 25,033, వనపర్తి జిల్లాలో 13,311, నాగర్​ కర్నూల్ జిల్లాలో 24,680, జోగులాంబ గద్వాల జిల్లాలో 10,208, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 55,826, వికారాబాద్ జిల్లాలో 17,350, హైదరాబాద్ జిల్లాలో 37,859 దరఖాస్తులు వచ్చాయి.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని పట్టభద్రులు ఈనెల 6లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పంకజ సూచించారు. ఆన్​లైన్​లో ఎన్నికల సంఘం వెబ్​సైట్ htpp://www.ceotelangana.nic.inలో, ఆఫ్​లైన్​లో డిజిగ్నేటెడ్ అధికారులకు ఫారం-18 దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వాటిలో ఆన్​లైన్​లో 2,72,160, డిజిగ్నేటెడ్ అధికారుల ద్వారా 5,772 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. అర్హులైన పట్టభద్రులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా 9 జిల్లాల్లో 179 మంది డిజిగ్నేటెడ్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి.. 'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details