సోలార్ విద్యుత్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆయా సంస్థలకు విద్యుత్ ఖర్చు ఆదా అవుతుంది. కాలుష్యాన్ని తగ్గించిన వారమవుతామని భావిస్తున్నాయి. అందుకే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు... పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అటువంటి కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని వజీర్ సుల్తాన్ టోబాకో.. వీఎస్‌టీ సంస్థను 1930లో ఏర్పాటు చేశారు. సుమారు 800ల పైచిలుకు... కార్మికులు, ఉద్యోగులు ఇందులో విధులు నిర్వహిస్తున్నారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు, యంత్రాల వినియోగానికి... భారీగా విద్యుత్ ను వినియోగించేవారు. ఇందుకోసం ప్రతి నెలా 50 లక్షల రూపాయలను విద్యుత్ వినియోగానికే ఖర్చు చేసేవారు. విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడంలో భాగంగా.. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వీఎస్‌టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా సంస్థ రూఫ్ టాప్‌పై సోలార్ పలకలను ఏర్పాటు చేసి.. ఒక మెగావాట్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం సోలార్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. 25శాతం సోలార్ విద్యుత్ ను సంస్థ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. తద్వారా ప్రతినెలా సుమారు 10లక్షల రూపాయలు.. సంస్థకు ఆదా అవుతోంది.
కేవలం సోలార్ వినియోగం మాత్రమే కాకుండా.. సమాజసేవలోనూ వీఎస్‌టీ పాలుపంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని సుమారు 200ల గ్రామాల్లో ఏడాదికి.. 4కోట్ల రూపాయల వరకు గ్రామీణ ప్రాంతాల మౌళిక సదుపాయల కల్పన కోసం... ఖర్చు చేస్తున్నట్లు వీఎస్‌టీ ఎండీ ఆదిత్య గూప్తు వెల్లడించారు. నిరుపేదలైన విద్యార్థులకు విద్యా, వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. క్రమక్రమంగా సాధారణ విద్యుత్ వినియోగం తగ్గించడంతో పాటు.... సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే దిశగా సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోందని.. ఆదిత్య గూప్తు పేర్కొన్నారు. వీఎస్‌టీ తరహాలో మరిన్నిసంస్థలు.. సోలార్ విద్యుత్ వినియోగానికి ముందుకువెళ్తే.. కాలుష్యాన్ని నివారించడంతో పాటు.. పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు.
కర్బన ఉద్గారాలను తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు.. ప్రతి కంపెనీ ఆలోచించి బాధ్యతగా సంప్రదాయ ఇంధన వనరుల నుంచి.. సంప్రదాయేతర ఇంధన వనరుల వైపు మారాలనే ఉద్దేశంతోనే ఈ విధానం చేపట్టాం. ఇంకా చాలా విషయాల్లో ముందుకువెళ్తాం. దేశంలోని చాలా కంపెనీలు ఈ విధానాన్ని అవలంబించాలి. కర్బన ఉద్గారాలను తగ్గించుకుని.. సోలార్ విద్యుత్ వైపు వెళ్లాలి. - ఆదిత్య గూప్తు, ఎండీ, వి.ఎస్.టి
ఇవీ చూడండి: