తెలంగాణ

telangana

'ఎస్సీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'

By

Published : Jan 27, 2021, 11:57 AM IST

గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేసి.. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో.. బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో సమావేశం నిర్వహించారు.

govt wants to creat Hatreds erupt between daliths
'ఎస్సీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'

వర్గీకరణ పేరుతో పాలకులు.. షెడ్యూల్ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆరోపించారు. బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో మాల మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల కార్యవర్గంతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.

గ్రామ స్థాయి నుంచి.. కార్యకర్తలను బలోపేతం చేసి, ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని చెన్నయ్య స్పష్టం చేశారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని వివరించారు.

ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా కేటాయించాలని చెన్నయ్య డిమాండ్​ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవన్​కు అంబేడ్కర్.. పేరు పెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి:గుర్తు పెట్టుకోండి.. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదాలే!

ABOUT THE AUTHOR

...view details