తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫుట్​పాత్​లపై నివసిస్తున్న వారికి ఆశ్రయం కల్పించండి' - సికింద్రాబాద్ కంటోన్మెంట్

సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయిన్పల్లి ప్రాంతాల్లో ఫుట్​పాత్​లపై నివసిస్తున్న పేదలకు.. స్థానిక వి.ఎన్.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ దుప్పట్లు పంపిణీ చేసింది. పేదలకు సాయపడటం తనకెంతో సంతృప్తినిస్తుందని ట్రస్ట్​ ఛైర్మన్ నవీన్ పేర్కొన్నారు.

govt should Provide shelter for those living on footpaths
'ఫుట్​పాత్​లపై నివసిస్తున్న వారికి ఆశ్రయం కల్పించండి'

By

Published : Jan 21, 2021, 9:02 AM IST

ఫుట్​పాత్​లపై నివసిస్తున్న వారి పరిస్థితి దయనీయమని వి.ఎన్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయిన్​పల్లి ప్రాంతాల్లో ఫుట్​పాత్​లపై నివసిస్తున్న 50 మందికి దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

పేదలకు సాయపడటం తనకెంతో సంతృప్తినిస్తుందన్నారు నవీన్​. ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్​డౌన్​లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అరుదైన కట్టడాలు.. కాపాడుకుంటేనే పది కాలాలు...

ABOUT THE AUTHOR

...view details