తెలంగాణ

telangana

ETV Bharat / state

'69 శాతం రెండు పడక గదుల నిర్మాణం పూర్తి' - డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. తొలి విడతలో 55,764 గృహాలు పూర్తయ్యాయని... మొత్తంగా 69 శాతం పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.

డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

By

Published : Jul 17, 2019, 9:16 AM IST

'69 శాతం రెండు పడక గదుల నిర్మాణం పూర్తి'

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తోంది. వాటి పురోగతిపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలివిడతలో రూ.18,520 కోట్ల వ్యయంతో అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,80,616 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించగా వాటిలో 55,764 పూర్తయ్యాయి. దాదాపు 69 శాతం గృహాలు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదలలో పారదర్శకత, జవాబుదారీ పాటిస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల అధికారులు అమలు తీరును ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details