తమకు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని హైదరాబాద్ చంచల్గూడా ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే తమ కార్యాలయంలో ఎనిమిది మందికి కరోనా వచ్చిందని చెప్పారు. అధికారులు ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
'రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయండి' - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ చంచల్గూడా ప్రభుత్వ ముద్రణాలయంలో కరోనా కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా ఎనిమిది మంది ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణయింది. ఆందోళనకు గురైన ఉద్యోగులు తమకు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని ధర్నా చేశారు.
'రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయండి'