తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Govt Explanation on RTC Bill : ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి.. యథాతథంగా ఆర్టీసీ సంస్థ

Telangana Govt
RTC Bill

By

Published : Aug 5, 2023, 11:55 AM IST

Updated : Aug 5, 2023, 1:48 PM IST

11:51 August 05

Telangana Govt Explanation on RTC Bill to Governor Tamilisai : ఆర్టీసీ బిల్లులో గవర్నర్‌ అభ్యంతరాలకు ప్రభుత్వం వివరణ

Telangana Govt Explanation on RTC Bill to Governor Tamilisai : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు..? ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా కాపాడతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛను ఇస్తారా? ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు, విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు తెలపాలని గవర్నర్ కోరగా.. నేడు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. ఆర్టీసీ సంస్థ యధావిధిగా కొనసాగుతుందని తెలిపింది.

కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదన్న ప్రభుత్వం.. కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని, బిల్లు ప్రధాన ఉద్దేశమే అదని స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబందించి ఎలాంటి అయోమయం లేదని.. ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామంది. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని వివరించింది. అన్ని అంశాలపై వివరణ ఇచ్చినందున ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది.

RTC Bill Issue in Telangana :ఆర్టీసీ కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించి.. సాంకేతికపరంగా ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించింది. అయితే ఆ బిల్లుకు గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వలేదు. తనకు పలు సందేహాలు ఉన్నాయని.. వాటిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్‌భవన్ వెల్లడించింది. అయితే గవర్నర్‌ తీరును ఆర్టీసీ కార్మికులు తప్పుపట్టారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని TMU నేతలు ఆరోపించారు. నేడు రెండు గంటల బంద్‌తో పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో కార్మికులు రోడెక్కారు.

Telangana Assembly Passes Rejected Bills : బిల్లుల పునఃఆమోదం.. గవర్నర్​ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రుల ఆక్షేపణ

RTC Workers on RTC Bill :ఇవాళ ఉదయం 2 గంటల పాటు బంద్‌తో మొదలైన ఉద్యోగుల నిరసన.. రాజ్‌భవన్‌ ముట్టడి వరకూ పోయింది. ఆర్టీసీ సేవలను ఆపేయడంతో ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. 10 మంది టీఎంయూ నాయకుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లింది. టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్‌.రెడ్డి, థామస్‌ రెడ్డి బృందంతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. పుదుచ్చేరి నుంచి తమిళిసై యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తనను బాధించిందని.. కార్మికుల సమ్మె వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఆర్టీసీ కార్మికుల పోరాటంలో తోడుగా ఉన్నానని.. కార్మికుల ప్రయోజనాల కోసమే బిల్లును క్షుణ్నంగా పరిశీలిస్తున్నానని స్పష్టం చేశారు.

TSRTC Bandh in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..

కార్మికుల భద్రత కోసమే బిల్లు పునః పరిశీలన..: ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాల కోసమే బిల్లును పునః పరిశీలనకు పంపానని గవర్నర్‌ శుక్రవారం వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే 5 అంశాలపై ప్రభుత్వం తరఫున స్పష్టతనివ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్‌భవన్ వెల్లడించింది. ఎట్టకేలకు గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత‌్వం వివరణనిచ్చింది.

Governor Tamilisai on TSRTC Bill : 'RTC సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛను ఇస్తారా..?'

Raj Bhavan on TSRTC Bill : కాస్త టైం కావాలి.. TSRTC బిల్లుపై రాజ్​భవన్ కామెంట్స్

Last Updated : Aug 5, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details