ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో అందించిన బేబీ కిట్ చూడడానికి ఆకర్షణీయంగానే ఉంది. కానీ.. అసలు విషయం ఆ బ్యాగ్ లోపల ఉందన్న వాస్తవం తర్వాత బయటపడింది. పేరుకు ఆ కిట్ పై వైఎస్ఆర్ బేబీ కిట్ అని రాసి ఉన్నా... బ్యాగ్ లోపల చూస్తే మాత్రం ఎన్టీఆర్ కిట్ పెట్టి ఉంది.
పైన వైఎస్ఆర్.. లోపల ఎన్టీఆర్!
ప్రభుత్వం మారితే పథకాలే కాదు.. రేషన్, కిట్ అందించే బ్యాగులు సైతం మారిపోతుంటాయి. కానీ.. ఒక్కోసారి కొందరు చేసిన పొరపాటు కారణంగా.. ఇలాంటి వింత పరిస్థితులే ఎదురవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఈ ఘటన వివరాలు మీరూ తెలుసుకోండి మరి.
పైన వైఎస్ఆర్.. లోపల ఎన్టీఆర్!
ఇది.. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎన్టీఆర్ బేబీ కిట్ సంచి కావడం గమనార్హం. ప్రభుత్వం మారడం వల్ల ఆ కిట్ స్థానంలో వై.ఎస్.ఆర్ బేబీ కిట్‌గా మార్పు చేసి బ్యాగ్ రంగు మార్చారు. ఇప్పుడు ఆ బ్యాగ్‌లు తెరవగానే లోపల గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఎన్టీఆర్ కిట్లు కనిపించడం.. లబ్ధిదారులను నివ్వెరపరిచింది.
ఇదీ చూడండి:'అమరావతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం'
TAGGED:
old baby kit news in kadapa