గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
పింఛన్లు
- కేవలం తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు.
- ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే.
- షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు.
- తెలంగాణ ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుంది.
- వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఫలితంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా ఫించన్లు అందనున్నాయి.
విద్యార్థులు, యువత
- విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోంది.
- దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది.
- యువత ఉపాధి కోసం నడుపుకునే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.
సంక్షేమ రంగం
- పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.
- హోంగార్డులకు దేశంలో ఎక్కడాలేనంత వేతనం తెలంగాణలోనే అందుతుంది.
- ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్స్ అందిస్తోంది.
- సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోంది.
- సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబరు వన్‌గా నిలబడింది.
విద్యుత్ రంగం
- విద్యుత్ రంగంలో తెలంగాణ అనితర సాధ్యమైన విజయాలు సాధించింది.
- ఉమ్మడి ఏపీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు.
- తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు వచ్చింది.
- ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నాం.
- రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
- రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది
వ్యవసాయం
- రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం.
- కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌తో చర్యలు.
- 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.
- 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు
నీటిపారుదల రంగం
- కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సమగ్ర జలవిధానం అమలు.
- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం.
- మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది.
- ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది.
- త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి.
- 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం మంజూరు చేసింది.
- త్వరలోనే సీతమ్మ బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయి.
- యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు.
- ఈ యాసంగిలో వరి సాగు 38,19,413 ఎకరాలు నమోదు.
- యాసంగిలో వరిసాగు 123.5 శాతం పెరిగింది.