క్షయను పూర్తిగా నివారించాలని గవర్నర్ తమిళిసై అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తులు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షయ వ్యాధిగ్రస్తులందరికీ నాణ్యమైన రోగ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని జిల్లా వైద్యాధికారి వెంకట్, టీబీ సంఘం ప్రధాన కార్యదర్శి సుధీర్ ప్రసాద్లను ఆదేశించారు.
కొన్నేళ్లలోనే రాష్ట్రంలో క్షయను పూర్తిగా నిర్మూలించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవమైన మార్చి 24న జంటనగరాల్లోని అన్ని బస్తీలు, నైట్ షెల్టర్లు, ఇతర ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. క్షయ, డెంగ్యూ, క్యాన్సర్ రోగాలపై విస్తృతంగా పరిశోధనలు చేశానన్న తమిళిసై... సమాజ సహకారంతో ఈ మూడు రోగాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు.