నిరుపేద వృద్ధ మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇచ్చిన పాలకుర్తి ఎస్ఐ సతీశ్‌ను గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్... ఎస్ఐ సతీశ్‌కు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రశంసా పత్రాన్ని ఎస్ఐకి అందజేశారు. వృద్ధురాలి ఇంటి నిర్మాణానికి ఎస్ఐ రూ. లక్ష 60 వేలు చందాలు పోగు చేయడం, తాను రూ.80 వేలు వెచ్చించి ఇల్లు నిర్మించడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.
పాలకుర్తి ఎస్ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై
వృద్ధ మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడంలో సాయం చేసిన పాలకుర్తి ఎస్ఐ సతీశ్‌ను గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ మేరకు ఆయనను రాజ్‌భవన్‌కు ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
పాలకుర్తి ఎస్ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై
ఎస్ఐ ఇచ్చిన రూ. 80 వేలను... తిరిగి రూ. 80 వేల చెక్కును ఆయనకు అందించారు. గవర్నర్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్.ఐని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు.