తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చవితి పండుగ నుంచి రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులన్నీ చక్కబడాలని కోరారు. ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించాలని ప్రజలంతా గణనాథుడిని ప్రార్థించాలని కోరారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించి పండుగ చేసుకోవాలని, గుంపులు గుంపులుగా ఉండవద్దని, పండుగ వల్ల కొత్త సమస్యలు రాకుండా, వైరస్ విస్తరించకుండా ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు! - గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగి దేశం, రాష్ట్రం ఐక్యత, శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రజలంతా కొవిడ్-19 నిబంధనలు పాటించి పండుగ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు!