కొవిడ్ రెండో దశలో ప్రమాదంలో ఉన్న లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు... దేశం ఎన్నో అడ్డంకులను సమర్థవంతంగా అధిగమిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. అమెరికాలోని లీడ్ ఇండియా-డీబీఏ లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ నిర్వహించిన "కొవిడ్ -19 సెకండ్ వేవ్" గ్లోబల్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. సాధారణంగా అయితే రోజుకు 900 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని.. కానీ కొవిడ్ తీవ్రత వల్ల రికార్డు స్థాయిలో రోజుకు 9,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దేశంలో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
Governor: కొవిడ్‌పై దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం: తమిళిసై
కొవిడ్‌కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అమెరికాలోని లీడ్ ఇండియా-డీబీఏ లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ నిర్వహించిన "కొవిడ్ -19 సెకండ్ వేవ్" గ్లోబల్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ప్రసంగించారు.
భారత వైమానిక దళం, నావికాదళం, రైల్వేలు, ఇతర రహదారి రవాణా సంస్థలను దేశంలోని ప్రతి ప్రాంతానికి మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి సేవల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. టీకా పరంగా స్థిరమైన పురోగతి సాధిస్తున్నామని.. రోజూ 20 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులను ఇస్తున్నామని వివరించారు. అతి త్వరలో రోజులో కోటి వ్యాక్సిన్ మోతాదులను ఇవ్వబోతున్నామని వెల్లడించారు. కొవిడ్ పరీక్షలను రోజుకు 20 లక్షలకు పైగా పరీక్షిస్తోందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల నమూనాలను పరీక్షించిందని గుర్తుచేశారు.
ఇదీ చూడండి:టీకాలు అందకుంటే కొవిడ్ మూడో దశా తీవ్రమే!