తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు ధైర్యం చెప్పేందుకే భద్రాచలం వెళ్తున్నా.. ఎవరితో నాకు సంబంధం లేదు..' - హైదరాబాద్ తాజా వార్తలు

Governor Badradri tour: కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తాను భద్రాచలం వెళుతున్నట్లు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పేర్కొన్నారు. భద్రాచలం పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్న ఆమె.. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

గవర్నర్​
గవర్నర్​

By

Published : Jul 17, 2022, 6:24 AM IST

Updated : Jul 17, 2022, 7:30 AM IST

Governor Badradri tour: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో కొత్తగూడెంనకు బయల్దేరారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్‌ మాట్లాడనున్నారు.

ఈ సందర్భంగా తన పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని గవర్నర్​ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు తాను భద్రాచలంనకు వెళ్తున్నానన్నారు. వరదల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గిరిజనులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలిసిందన్న గవర్నర్‌.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పర్యటనకు మరెవరో వెళ్తున్నారనేది తనకు సంబంధం లేదని.. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

Last Updated : Jul 17, 2022, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details