తెలంగాణ

telangana

ETV Bharat / state

కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికి ఫార్మ్‌లు కావాలి: గవర్నర్‌ - Governor Targets CM KCR

Republic Day Celebrations at Telangana Raj Bhavan: రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్‌ సర్కారు తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే ఇష్టమన్న ఆమె.. తెలంగాణ అభ్యుదయంలో తన పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. అధికారికంగా జరిగిన వేడుకల్లో డీజీపీ, సీఎస్‌ హాజరైనా.. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు.

Republic Day Celebrations at Raj Bhavan
Republic Day Celebrations at Raj Bhavan

By

Published : Jan 26, 2023, 8:32 AM IST

Updated : Jan 26, 2023, 10:50 AM IST

Republic Day Celebrations at Telangana Raj Bhavan: రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్‌ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం.. గవర్నర్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై.. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని పేర్కొన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆమె.. కేసీఆర్‌ సర్కారు తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని పేర్కొన్నారు.

Tamilisai Comments on CM KCR : ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశమని గవర్నర్‌ పేర్కొన్నారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారన్న తమిళిసై.. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని తెలిపిన తమిళిసై.. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందని స్పష్టం చేశారు.

Governor Targets CM KCR : ప్రజాప్రతినిధులు రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలన్న గవర్నర్‌.. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తాను కొంత మందికి నచ్చకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్న గవర్నర్‌.. రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యువత ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

"రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్‌ అందిస్తోంది. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందాం. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణ అభ్యుదయంలో నా పాత్ర ఉంటుంది. నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం, అందుకే ఎంత కష్టమైనా పని చేస్తా." - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికి ఫార్మ్‌లు కావాలి: గవర్నర్‌

ఆరుగురికి సన్మానం..: గవర్నర్‌ ప్రసంగం అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ, విశిష్ట సేవలందిస్తున్న ఆరుగురిని గవర్నర్‌ సన్మానించారు. కీరవాణి, చంద్రబోస్‌తో పాటు సివిల్స్ శిక్షకురాలు బాలలతను సత్కరించారు. పారా అథ్లెట్ లోకేశ్వరి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని ఆకుల శ్రీజ తరఫున వారి తల్లిదండ్రులు, ఎన్జీవో భగవాన్, మహవీర్ వికలాంగ సహాయతా సమితి ప్రతినిధులను సన్మానించారు.

ఇవీ చూడండి..

రాజ్‌భవన్​లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం

రాష్ట్రం నుంచి ఐదుగురికి 'పద్మ' పురస్కారాలు.. ఇదే వారి నేపథ్యం

Last Updated : Jan 26, 2023, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details