నిత్యం యోగా చేయడం వల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకురుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ మూలాల్లో, వైదిక జీవన పద్ధతుల్లో, మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి, ప్రకృతి రక్షణకు అనువైన విధానాలు ఉన్నాయన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ జీవనం కీలకమన్నారు. మన జాతీయ సంప్రదాయాన్ని అంతర్జాతీయ కార్యక్రమంగా మార్చిన ప్రధాని మోదీకి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఈషా పౌండేషన్ దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ భవన్ నుంచి ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొన్నారు. సంపూర్ణ జీవన శైలి, సహజ ఆహార అలవాట్లు భవిష్యత్ భారత్కు, భూగోళ రక్షణకు విజన్ అన్న అంశపై ప్రసంగించారు.
తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ.... తన నానామ్మ చేతులు, కాళ్లు కడుక్కుంటేనే తనను ఇంట్లోకి రానిచ్చేవారని... ఇప్పుడు కరోనా వైరస్ కాలంలో అప్పటి అలవాట్లు ఎంత ఆరోగ్యకరమైనవో తెలిసివస్తున్నాయన తమిళిసై వివరించారు.