ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐ హాస్పిటల్‌లోని బ్లడ్ బ్యాంకును ఆమె సందర్శించారు. ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలున్నాయని ఆమె పేర్కొన్నారు. దాతలు ఈఎస్‌ఐ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'
తెలంగాణలో కరోనా లక్షణాలతో ఎవరూ మరణించకూడదనేదే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్లాస్మా థెరఫీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని గవర్నర్ స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మా దానం చేయాల్సిందిగా తమిళిసై కోరారు.
'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'
ఈ సందర్భంగా ప్లాస్మా దాత సంతోష్‌కు గవర్నర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. మీడియా సిబ్బందికి భౌతిక దూరం పాటించినందుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని గవర్నర్ కోరారు.
ఇదీ చూడండి :ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరాహార దీక్ష