గిరిజన ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గిరిజనులు వాళ్ల శైలిలో కొన్ని అద్భుతమైన వస్తువులను తయారు చేస్తారని, వాటికి మంచి ధర కల్పించగలిగితే ఆర్థికంగా బలపడేందుకు అవకాశాలుంటాయని అభిప్రాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌లోని రాజ్ భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్ని రకాలుగా కృషి
గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జాతీయ స్థాయిలోనే ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారం తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాధి, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని అన్నారు. అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ఉత్పత్తులు అందేలా చూడాలని రాజ్‌భవన్ అధికారులకు గవర్నర్ సూచించారు.