తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆపదలో ఉన్న వారికి తక్షణమే సాయం అందించండి: తమిళిసై - tamilisai

Governor Review on Rains: అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బాధితులకు సాయమందించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫీస్ బేరర్లతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అజయ్ మిశ్రా, అధికారులు హాజరయ్యారు.

Governor Review on Rains
Governor Review on Rains

By

Published : Jul 11, 2022, 10:34 PM IST

Governor Review on Rains: భారీ వర్షాల నేపథ్యంలో ఆపదలో ఉన్న వారికి తక్షణమే సాయం అందించాలని రెడ్ క్రాస్ సంస్థకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. అన్ని జిల్లాల రెడ్ క్రాస్ యూనిట్ల ఆఫీస్ బేరర్లతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అజయ్ మిశ్రా, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న సహాయ కార్యక్రమాలను సమీక్షించిన గవర్నర్ తమిళిసై... కలెక్టర్లు, జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బాధితులు, అవసరమైన వారికి తగిన సహాయం అందించాలని కోరారు. జూనియర్, యువ రెడ్ క్రాస్ వాలంటీర్ల జాబితాను సిద్ధంగా ఉంచారని జిల్లా యూనిట్లను తమిళిసై ఆదేశించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర యూనిట్ నుంచి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details