తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai: 'మోదీ 'మన్​ కీ బాత్​' ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది' - Narendra Modi at Manki Baat programme

Governor Tamilisai on Mann Ki Baat: మన్​ కీ బాత్​ వందో ఎపిసోడ్​ కార్యక్రమాన్ని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులతో కలిసి రాజ్​భవన్​లో​ విన్నారు. అనంతరం మాట్లాడిన ఆమె.. ఈ కార్యక్రమం ద్వారా చాలా విషయాలు ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారని తెలిపారు. చాలా ప్రభుత్వ పథకాలు ఈ కార్యక్రమంలో ప్రస్తావించడంతో విజయవంతంగా ముందుకు వెళ్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

Raj Bhavan
Raj Bhavan

By

Published : Apr 30, 2023, 12:41 PM IST

Governor Tamilisai on Mann Ki Baat: 'మన్‌ కీ బాత్‌' వందో ఎపిసోడ్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ పాల్గొన్నారు. పలువురు విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆమె విన్నారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. మన్ కీ బాత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిందని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారి గురించి సైతం ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్​లో ప్రస్తావించారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమం ద్వారానే.. స్వచ్ఛ భారత్​ను ప్రజల్లోకి తీసుకువెళ్లారని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ డ్రైవ్​లో భాగంగా ఇప్పటి వరకు 70 లక్షల మంది యువత, 2 కోట్ల మందికి పైగా చిన్నారులు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్నారని గవర్నర్​ తెలిపారు. ఈ క్రమంలోనే మన్ కీ బాత్​లో చెప్పిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అత్యంత విజయవంతమైందని తెలిపారు. ట్రాన్స్​ప్లాంటేషన్ గురించి మన్ కీ బాత్​లో మాట్లాడినప్పుడు తాను కంటతడి పెట్టుకున్నట్లు గవర్నర్​ వివరించారు. కిడ్నీ రోగుల బాధలను ప్రధాని అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు. మోదీ చెబుతున్న గొప్ప మాటలు.. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాయని.. దేశం మంచి మార్గంలో నడుస్తోందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"మిల్లెట్ ఆహారం గురించి ప్రధాని ప్రస్తావించారు. వందే భారత్ కార్యక్రమం ఆత్మ నిర్భర్ భారత్​కు నిదర్శనం. రైల్వే వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. రాజ్​భవన్ వేస్ట్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని బోయిన్​పల్లి మార్కెట్ వారిని కోరుతున్నాం."- తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్​

అంతకుముందు 'మన్‌ కీ బాత్'పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను గవర్నర్ తిలకించారు. అనంతరం మన్‌ కీ బాత్, యోజన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికాధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ వర్సిటీల ఉపకులపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Narendra Modi speech in Mann ki Baat: 'మన్‌ కీ బాత్‌' వందో ఎపిసోడ్‌​ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఎల్​ఈడీ స్కీన్​లు ఏర్పాటు చేసి ప్రసంగం వినడానికి తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. 'మన్‌ కీ బాత్‌' వందో ఎపిసోడ్‌లో దేశవ్యాప్తంగా ప్రజలు మన్‌ కీ బాత్‌లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మన్‌ కీ బాత్‌లో చర్చించామని తెలిపారు. అసామాన్య సేవలందిస్తున్న ప్రజలతో మాట్లాడే అవకాశం ఈ కార్యక్రమంతో లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Modi Mann Ki Baat: 'మన్ కీ బాత్' నిరాటంకంగా కొనసాగాలి.. ప్రధానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Mann Ki Baat: మోదీ మనసు గెలుచుకున్న తెలంగాణ విశేషాలివే

Padakandla Srinivas: వ్యర్థాలకో అర్థం.. మోదీ మెచ్చిన వైనం

ABOUT THE AUTHOR

...view details