Governor Tamilisai Comments : సైనికుల త్యాగాలు, పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. సైనికుల త్యాగాలు మరువలేనివన్న గవర్నర్.. పాఠశాలల్లోనూ విజయ్ దివస్ నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.
సైనికుల త్యాగాలు మరువలేనివి: గవర్నర్ తమిళిసై - Martyrs Memorial Stupa
Governor Tamilisai Comments : విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమరవీరుల స్మారక స్థూపానికి గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి యుద్ధవీరులను స్మరించుకున్నారు.
Governor Tamilisai
''భారత సైనికుల ధైర్యసాహసాలు, సేవలు ఎనలేనివి. సైనికుల వల్లే ఇంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం.సైనికుల త్యాగాలు మరువలేనివి'' -తమిళిసై, తెలంగాణ గవర్నర్
ఇవీ చూడండి: