Say no to Drugs run: యువకులు మత్తపదార్ధాల బారినపడకుండా ప్రభుత్వాలతో పాటు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. హైదరాబాద్ బేగంపేటలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సే నో టు డ్రగ్స్' నినాదంతో చేపట్టిన పరుగును గవర్నర్ ప్రారంభించారు.ఆ ర్యాలీ కర్ణాటకలోని గోకర్ణ వరకు సుమారు 660 కిలోమీటర్లు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో సినీనటి మంచులక్ష్మితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎస్.కె. జోషి, అదనపు డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యాలు తగ్గుతాయి
Governor inaugurated Say no to Drugs run: యువకులు మత్తుపదార్ధాలను తప్పడు మార్గంలో వినియోగిస్తున్నారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వాటికి బానిసలు కావడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్ధాలు తాత్కాలికంగా సంతోషం కలిగించవచ్చు.. కానీ శాశ్వతంగా అనారోగ్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంతో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని.. మత్తుపదార్ధాలు వాడొద్దని గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు.
డీ ఎడిక్షన్ సెంటర్లు కావాలి