తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai: ఇంటర్నెట్ లేని జీవితాలు ఊహించలేం - టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా

సాంకేతికత మన జీవితంలో భాగమైందని... ఇంటర్నెట్​ లేని జీవితాలు ఊహించలేమని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. హైటెక్స్​లో జరిగిన గ్లోబల్ ఇగ్నైట్‌ - 2021 సదస్సులో పాల్గొన్న గవర్నర్ సాంకేతికపై చర్చించారు.

Governor Tamilisai
గవర్నర్ తమిళిసై

By

Published : Oct 29, 2021, 2:19 PM IST

సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ దూసుకెళ్తోందని... మన జీవితంలో భాగమైందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారత్‌ రెండో అతిపెద్ద ఇంటర్నెట్‌ వినియోగదారు అని తెలిపిన గవర్నర్‌.... ఇంటర్నెట్ లేని జీవితాలు ఊహించలేమన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన గ్లోబల్‌ ఇగ్నైట్‌ సదస్సుకు గవర్నర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీ-హబ్‌ సీఈవో దీప్తి రావుల, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా పాల్గొన్నారు.

కరోనా వేళ ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్నెట్ ఎంతో దోహదపడిందన్న గవర్నర్‌.... నిరుపేద విద్యార్థులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. వారి కోసం... వ్యక్తులు, సంస్థల నుంచి వాడిన ల్యాప్‌టాప్‌లను సేకరిస్తున్నామని తెలిపారు. వాడిగలిగే స్థితిలో ఉండి పక్కనపెట్టిన ల్యాప్‌టాప్‌లను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంతో నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:IRCTC News: పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేరు- కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details