Governor on Liberation Day: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవటం గర్వకారణమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. భారత్కు 1947 ఆగస్టు15 నాటికే స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్లో భాగంగా ఉన్న తెలంగాణ, మరాట్వాడ, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలు మాత్రం 1948 సెప్టెంబర్17న స్వేచ్ఛా వాయువులు పీల్చాయని పేర్కొన్నారు.
'హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందాం' - తమిళసై సౌందరరాజన్
Governor on Liberation Day: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని ఆమె కొనియాడారు. నేటి తరానికి విమోచన ఉద్యమంలో ఎదుర్కొన్న బాధాకర పరిస్థితుల గురించి తెలియాల్సిన అవసరం ఉందన్న ఆమె.. ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన సమయమిదన్నారు.
Governor
హైదరాబాద్ విమోచన ఉద్యమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న ఆమె.. విమోచనం కోసం ప్రజలు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమన్నారు. నేటి తరానికి విమోచన ఉద్యమంలో ఎదుర్కొన్న బాధాకర పరిస్థితుల గురించి తెలియాల్సిన అవసరం ఉందన్న గవర్నర్.. ఆనాటి నాయకులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన సమయమిదన్నారు. విమోచనం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: